| 👁 S |
| ISO basic Latin alphabet |
|---|
| AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrTtUuVvWwXxYyZz |
S (ఉచ్చారణ: యస్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 19 వ అక్షరం.
రచనా వ్యవస్థలలో వాడకం
[మార్చు]S అక్షరం ఆంగ్లంలో ఉపయోగించే అక్షరాలలో ఏడవ అత్యంత సాధారణ అక్షరం, t, n అక్షరాల తరువాత హల్లు అక్షరాలలో ఉపయోగించే మూడవ అత్యంత సాధారణ హల్లు. స్థానం ప్రారంభ, ముగింపులో ఇది చాలా సాధారణ అక్షరం. ఆంగ్లభాషలో s అనేది బహువచన నామవాచకాల యొక్క సాధారణ గుర్తు, ఈ అక్షరాన్ని నామవాచక పదము యొక్క చివర అక్షరంగా చేర్చడం వలన అది బహువచనం అవుతుంది. (ఉదాహరణకు ఆంగ్లంలో Lion ఆనగా సింహం, అలాగే Lions అనగా సింహాలు) ఇది ఇంగ్లీష్‌లో మూడవ వ్యక్తిని సూచించే ప్రస్తుత కాలం యొక్క క్రియల యొక్క సాధారణ ముగింపు. (ఉదాహరణకు he's - అతని యొక్క, her's - ఆమె యొక్క, it's - దీని యొక్క)
S కి అర్థాలు
[మార్చు]- క్యాలెండర్లలో, S అనేది చాలా సార్లు శనివారం లేదా ఆదివారం లేదా సెప్టెంబర్ నెలకు సంక్షిప్త అక్షరం.
- రసాయన శాస్త్రంలో, S అనేది సల్ఫర్ కు చిహ్నం.
- వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లో, S అనేది "బోనస్ రౌండ్" లో పాల్గొనే ఏ పోటీదారునికైనా ఇవ్వబడిన ఆరు అక్షరాలలో ఒకటి.
- S అనేది పాములు చేసే హిస్సింగ్ శబ్దాన్ని వర్గీకరించడానికి ఒనోమోటోపిక్‌గా ఉపయోగించే అక్షరం, ఉదా. "ssssss..."
- హీబ్రూ ప్రజలు కూడా "S" ను పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే ఇది సమేహ్, దేవుడు యొక్క మొదటి అక్షరం.
- S (ప్రోగ్రామింగ్ భాష) గణాంకాల కోసం ఉపయోగించబడుతుంది.
ఇతర వెబ్ సైట్లు
[మార్చు]- 👁 Image
The dictionary definition of s at Wiktionary - 👁 Image
Media related to S at Wikimedia Commons
మూలాలు
[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=S&oldid=4645514" నుండి వెలికితీశారు
