VOOZH about

URL: https://x.com/TelanganaCOPs

⇱ Telangana Police (@TelanganaCOPs) / X


Telangana Police
17.4K posts
Telangana Police
@TelanganaCOPs
Official ‘X’ handle of the Telangana Police. Emergency Dial 112🚨
Hyderabad, Telangana, India.
Joined December 2019
  • మల్టీలెవల్‌ మార్కెటింగ్ మాయలో పడకండి. ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రోడక్ట్స్ కొంటే చాలు లాభాలు వస్తాయని బ్రెయిన్‌ వాష్‌ చేసేవారితో జాగ్రత్త. పేరు ఏదైనా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ అంటేనే పచ్చిమోసం. మీతో పాటూ మరికొందరి బలిచేయకండి. #TelanganaPolice
  • ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు! మల్కాజిగిరి కమిషనరేట్ నూతన క్యాంపు కార్యాలయాన్ని డీజీపీ సి.వి.ఆనంద్, పి.సుదర్శన్ రెడ్డి, సీపీ బి.సుమతి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా సీపీ రంగనాథ్ గార్లు ప్రారంభించారు. 11 పోలీస్ స్టేషన్ల పరిపాలనకు ఇది కేంద్ర బిందువు. #TelanganaPolice
  • ఆన్‌లైన్‌లో ఏవైనా బిల్స్‌ చెల్లింపు, రిచార్జ్‌లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు, యాప్స్‌ వాడకండి. కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించండి. #TelanganaPolice#CyberCrime#FakeWebsites
  • సులభంగా డబ్బులు వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా మోసపోతున్నారని అర్ధం. ఉచితాలు, డిస్కౌంట్ల మాయలో పడి ఖాతాలు ఖాళీ చేసుకోవద్దు. మీ అత్యాశ, అమాయకత్వమే సైబర్ మోసగాళ్ల పెట్టుబడి. ఇంట్లో కూర్చుంటే ఊరికనే డబ్బులెవరూ ఇవ్వరు. మోసపోకండి. #TelanganaPolice#WorkFromHomeScam#cybercrime
  • కేవలం ఐదు నిమిషాల్లో లోన్ వస్తుందనే మాటల్ని నమ్మి అపరిచితులకు మీ వివరాలు ఇవ్వొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్బీఐ అనుమతి లేని యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయొద్దు, వాటి నుంచి లోన్ తీసుకోవద్దు. #telanganapolice
  • సైబరాబాద్ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నివారణకు ముందడుగు పడింది. ప్రభుత్వ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి చొరవతో పోలీస్, ట్రాఫిక్, GHMC, ఇరిగేషన్, HYDRAA మరియు మున్సిపల్ అధికారులతో అత్యవసర సమన్వయ సమావేశం & క్షేత్రస్థాయి ఉమ్మడి తనిఖీలు నిర్వహించాము.
  • హెల్మెట్ ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. చలాన్‌ను తప్పించుకోవడం కోసం కాకుండా..మీకు రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్ వాడండి. నాసిరకం హెల్మెట్లు మిమ్మల్ని ప్రమాదాల బారి నుంచి కాపాడలేదు. అజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. #telanganapolice#ArriveAlive
  • భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్‌లో వరదలు, ట్రాఫిక్ నివారణపై మల్కంపేటలో అత్యవసర సమీక్ష జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో, సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో GHMC, HYDRAA, పోలీస్ శాఖల సమన్వయ చర్యలపై చర్చించారు. #TelanganaPolice
  • ప్రజాపాలన 99రోజుల పురోగతిపై సీఎం శ్రీ @revanth_anamula సమీక్ష. రోడ్డుభద్రత (Arrive Alive) మహిళా భద్రత, యాంటీ నార్కోటిక్ వంటి అంశాలతో గ్రామసభల ద్వారా ప్రజలకు చేరువైన #TelanganaPolice కి సీఎం అభినందనలు. పోలీస్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలతో సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అన్నారు.
  • లాటరీ వచ్చిందని మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌, కాల్స్ వస్తే వాటిని ఖచ్చితంగా అనుమానించాల్సిందే. డబ్బు ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు మీ ఖాతాను ఖాళీ చేసే ప్రయత్నమని గ్రహించండి. అత్యాశతో వాటికి స్పందిస్తే అంతే సంగతులు. లాటరీ మోసాలపై అవగాహన పెంచుకోండి. #telanganapolice
Don't miss what's happening
People on X are the first to know.