VOOZH about

URL: https://x.com/abburiravi

⇱ Abburi Ravi (@abburiravi) / X


Abburi Ravi
1,230 posts
Abburi Ravi
@abburiravi
WRITER ...Bommarillu,Kick,KiKk,Mr.Perfect, Don, Athidi,Yevadu,Yevaru,Panja, Oopiri, DiscoRaja,Naandi,Yekkadiki pothavu chinnavada,Kshanam, Gudachari,G2,Dacoit,
Hyderabad
Born August 22
Joined April 2010
  • Pinned
    @sirivennela1955 సద్గురువు మన జీవన విధానాన్ని సరిచేస్తారు. మన జీవన విధానం లో భాగమైపోతారు అలాంటి సద్గురువులు నా జీవితంలో ఇద్దరు. అమ్మానాన్న మరియు సీతారామ శాస్త్రి గారు. అడుగడుగునా నా జీవితాన్ని ప్రభావితం చేశారు .చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు . మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోడానికి.
  • 1.ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో, నాకు నడుము నెప్పి వస్తోంది సర్ అంటే, ఠక్కున లేచి లోపలికి వెళ్పోతే కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప, దిండు తెచ్చి నన్ను పడుకోమని నా పక్కన ప్యాడ్ పెన్ పట్టుకొని కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు .#HBDPawanKalyan
  • యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాలంతే…వేరే దారి లేదు. ఇది మీ రాజకీయ ప్రయాణం నిరూపించింది. బోల్డన్ని శుభాకాంక్షలు @PawanKalyan గారూ❤️
  • Replying to @abburiravi
    8. ప్రజల కోసం, ప్రజల పక్కన నిలబడాలన్న ఆయన ఆశయం సంపూర్ణం గా నెరవేరాలని మనస్పూర్తి గా కోరుకుంటూ, ఆయన బాగుంటే కోట్ల మంది బాగుంటారని నమ్ముతూ, ఆయన పెదాల మీద చిరునవ్వు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan సర్.. #HBDPawanKalyan
  • పుట్టినరోజు శుభాకాంక్షలు @PawanKalyan సర్. మిమ్మల్ని చూసిన ప్రతి సారి అన్పిస్తుంది- "మనపై అభిమానం తనంత తానుగా రావాలి . మనంత మనంగా సంపాదించుకోవాలి" అని. ఎందుకంటే, అలా పుట్టిన అభిమానం, అభిమానులు కడదాకా మనతోనే ఉంటారు. మీ ఆశయం నెరవేరాలి సర్. మంచి సమాజం కోసం మీరు చేస్తున్న యుద్ధం
  • సభావేదిక మీద నిల్చొని ప్రజలతో మాట్లాడే వ్యక్తి, “మనం” అన్నప్పుడల్లా అందులో “జనం” ఉంటే, ఆ వ్యక్తి నాయకుడు. ఆ నాయకుడు మనకోసం సుఖాలు వదిలేస్తాడు. మనకన్నా ముందు మనకోసం నిలబడతాడు. ప్రశ్నిస్తాడు. ఉద్యమం చేస్తాడు. యుద్ధం చేస్తాడు. ఆ నాయకుడు పిడికిలి బిగించినా మనకోసమే. తలదించినా
  • #HBDPowerStar#HBDJanasenani@PawanKalyan పుట్టినరోజు శుభాకాంక్షలు సర్.💐 ఎలా సర్ ఇలా! మిమ్మల్ని కలిసినా కలవకపోయినా, మీతో పని చేసినా చెయ్యకపోయినా, మీ సినిమాలు తల్చుకోని రోజు లేకుండా, మీ సంస్కారం మెచ్చుకోని రోజు లేకుండా, మీ మంచితనం గుర్తురాని రోజు లేకుండా… ... ఎలా సర్ ఇలా!!
  • Replying to @abburiravi
    7. ఆయన వ్యక్తిత్వం నామాటల్లో చెప్పాలని పంజా సినిమా లో ప్రయత్నించాను. అప్పుడు పుట్టిన మాటలే " సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో , సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు " #HBDPawanKalyan
  • తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు. “డబ్బింగ్” సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమా లో, ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి చక్కగా మార్చేవారు. అది కూడా మానేసి విడుదల చేస్తున్నారు. వారి వారి భాష లలో వారి గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవిస్తాను. కానీ, తెలుగు ప్రేక్షకులని
  • Replying to @abburiravi
    6. బాధ వస్తే అమ్మ ఒడి ని వెతుక్కునే పసిపిల్లాడు. మంచితనం చూస్తే పరవశం. ఆడపిల్లకి అవమానం జరిగితే ఆవేశం. లేనితనం చూస్తే కంట్లో నీళ్లు. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, ఈ లక్షణాలు అప్పటికప్పుడు రావు. బై బర్త్ కూడా కాదు బిఫోర్ బర్త్ నించి ఉండాలి. అంతే. #HBDPawanKalyan@PawanKalyan
  • Replying to @abburiravi
    5. అన్నవరం టైం లో ఆయనకిచ్చిన నా 1983 చందమామ కధల బౌండ్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, పంజా సినిమా రాయడానికి ముందు ఒక అసిస్టెంట్ తో పంపించి, అందినట్టు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. "పుస్తకం విలువ తెల్సిన మనిషి కి జీవితం విలువ ఖచ్చితం గా తెలుస్తుంది." #HBDPawanKalyan@PawanKalyan
Don't miss what's happening
People on X are the first to know.